కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు వున్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం(2)
కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు వున్నాయి
మనసులో ధ్యానం మాటలో మౌనం
మనసులో ధ్యానం మాటలో మౌనం
మనసు మాటకందని నాడు
మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే
పాటకు పల్లవి పుడుతుంది (మనసు)
పల్లవించు పడుచుదనం
పరుచుకున్న మమతను చూడు(2)
పసితనాల తొలి వేకువలో
ముసురుకున్న మబ్బును చూడు
అందుకే ధ్యానం అందుకే మౌనం
కొమ్మ కొమ్మకో సన్నాయి.......
కొంటె వయసు కోరికలాగ
గోదారి ఉరకలు చూడు
ఉరకలేక ఊగిసలాడే
పడవకున్న బంధం చూడు(కొంటె)
ఒడ్డుతోనూ...నీటితోనూ
పడవ ముడి పడి వుండాలి
ఎప్పుడే ముడి ఎవరితో పడి
పడవ పయనం సాగునో మరి
అందుకే ధ్యానం అందుకే మౌనం(2)(కొమ్మ కొమ్మకో)
Good Song
ReplyDeleteSuper
ReplyDelete